టీడీపీ నేత నారా లోకేష్ నిన్న కుటుంబ ఆస్తులను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్తుల వివరాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఇది ఎప్పుడూ ఉండే డ్రామానే అని వ్యాఖ్యనించారు. వాస్తవానికి ఈ తండ్రీ కొడుకులే ఏపీతో పాటు దేశ పరిస్థితికి అతి పెద్ద జవాబుదారీలని పేర్కొన్నారు. నారా కుటుంబం ఆస్తులను ప్రకటించడం కొత్తేమి కాదని, వాళ్ల వెల్లడించని ఆస్తులు ఎన్నో ఉన్నాయని, బహిర్గతం చేయని ఆస్తులు, బినామీ ఆస్తులు, రహస్య బ్యాంకు ఖాతాల్లో ఉన్న వాటిపై ఎప్పుడూ విచారణ జరగలేదని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు. చంద్రబాబుకు అరెస్ట్‌ భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు చేస్తుంటాడని, కార్యకర్తల మధ్య ఉంటే తననెవరూ తాకలేరనే ధీమాలో ఉంటాడని ఆరోపించారు. ఎమ్మెల్యేలను చుట్టూ పెట్టుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడని అన్నారు.

కాగా, ప్రజా చైతన్య యాత్ర పేరిట చంద్రబాబు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 13 జిల్లాల్లో, వంద నియోజకవర్గాల్లో పర్యటన చేసేలా బాబు సిన్నద్దమయ్యారు. దీనిపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబును చూస్తే జాలేస్తోందని, గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపర్చాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు స్పందన లేకుండా ఉంటే ఎలా.. అడిగినందుకైనా కొద్దిసేపైనా చప్పట్లు కొట్టొచ్చు కదా..అని ట్విట్‌ చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.