క్వారంటైన్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

By సుభాష్  Published on  22 July 2020 9:03 AM GMT
క్వారంటైన్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా టెన్షన్‌ పట్టుకుంది. గత కొన్ని రోజులుగా ఆయన పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ఆయన అస్వస్థకు గురైనట్లు సమాచారం. దీంతో ముందు జాగ్రత్తగా ఆయన హోంక్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌ఖాతాలో పోస్టు చేశారు.

తాను ఓ వారం పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేందుకు నిర్ణయించుకున్నానని, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ ద్వారా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాగా, విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.Next Story