కోడెల కుటుంబాన్ని వెంటాడుతున్న కష్టాలు..కోర్టులో లొంగిపోయిన విజయలక్ష్మి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 5:55 AM GMT
కోడెల కుటుంబాన్ని వెంటాడుతున్న కష్టాలు..కోర్టులో లొంగిపోయిన విజయలక్ష్మి..!

గుంటూరు: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ప్రతి ఆదివారం నరసరావుపేట వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో సంతకాలు పెట్టాలని ఆదేశించింది.

అయితే విజయలక్ష్మి ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. షేక్ యాసిన్,ఆడపాల సాయి అనే ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో.. పోలీసులు ఆమెపై 420,506,బెదిరింపులు, అక్రమ వసూళ్లు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలోనే విజయలక్ష్మి నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. విచారణ జరిపిన జడ్జి బెయిల్ ఇచ్చారు. విజయలక్ష్మికి ఇప్పటి వరకు రెండు కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇవే కాక మరికొన్ని కేసుల్లో కూడా ఆమెపై ఉన్నాయి.

Next Story
Share it