ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండయ్యా!
By రాణి
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ మాజీ మంత్రులను టార్గెట్ చేసి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇటీవలే నాగబాబు - విజయసాయి కి మధ్య ట్విట్టర్ వార్ అయింది. తాజాగా..సోమవారం సాయంత్రం జరిగిన జగన్ ప్రెస్ మీట్ పై టీడీపీ నేతలు విమర్శలు చేయగా..విజయసాయి వాటిపై స్పందించారు.
Also Read : ఏపీలో కరోనా విజృంభన.. కొత్తగా 82కేసులు
'' అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన వీళ్లు మంత్రులుగా బాబు హయాంలో మేధావులమని బిల్డప్ ఇచ్చేవారు. కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టెస్టులు ఎక్కువ చేసి చూపించడమేంటి? వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటి? కరోనా గురించి ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండయ్యా! అంటూ సెటైర్లు వేశారు.'' విజయసాయి టీడీపీ పై సెటైర్లు వేస్తే..నెటిజన్లు విజయసాయి, జగన్ లపై సెటెర్లు వేస్తూ టోల్స్ చేస్తున్నారు.
Also Read : రికార్డ్ స్థాయిలో భారీగా పెరిగిన బంగారం ధర
'' నిన్న సాయంత్రం మాస్టారు చెప్పిన పాఠం చాలు గురువుగారు. సర్వం బోధపడింది. ఇంక చాలు మళ్ళి మళ్ళి ట్యూషన్ అంటే కష్టం. its nothing but జ్వరం.పాపం అమెరికా వెనుకపడిన దేశం కదా తెలుసుకోలేక పోతుంది'' అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. మరో నెటిజన్ ''ఇంకా నయం అవినీతి , అరాచకం ఆవహించినవాళ్ళు అంటావనుకున్న ..నీ qualifications నీ దగ్గరే పెట్టుకున్నావు !!'' అంటూ కామెంట్ చేశారు.