అమరావతి : ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మినవారు ఆపదలో ఆదుకోలేదనే బాధతోనే కోడెల ఆత్మహత్యు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో విజయసాయి రెడ్డి స్పందించారు. వైఎస్ఆర్‌ సీపీ నుంచి కొనుగోలు చేసిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా కోడెలను బాబు వాడుకుని వదిలేశారని విమర్శించారు. కోడెల మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేసి ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.