విజయారెడ్డి కేసులో నిందితుడు సురేష్ మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 11:13 AM GMT
విజయారెడ్డి కేసులో నిందితుడు సురేష్ మృతి..!

ముఖ్యాంశాలు

  • విజయారెడ్డి కేసులో నిందితుడు సురేష్ మృతి
  • మూడున్నర గంటలకు మృతి చెందిన ప్రకటించిన వైద్యులు
  • ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : తహశీల్దార్‌ విజయారెడ్డిని సజీవదహనం చేసిన సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈసీజీలో పల్స్‌ రేటు ఫ్లాట్‌గా రావడంతో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్‌ తొలగించినట్లు పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిపై రైతు సురేశ్‌ సోమవారం పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో విజయారెడ్డి స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ఘటనలో సురేష్ కు 65 శాతం గాయాలయ్యాయి. సురేష్ ను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా..మృతి చెందాడు.

తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్‌ చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశాననని చెప్పాడు. అయినప్పటికీ ఆమె స్పందించలేదన్నాడు. పెట్రోల్‌ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై పెట్రోల్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ ఘటనలో విజయారెడ్డిని కాపాడటానికి ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం కూడా చనిపోయాడు. సురేష్ మృతితో ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

Next Story
Share it