బాబూ ఎంతగా దిగజారి పోయావు..!- ట్విటర్ లో విజయసాయిరెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 1:02 PM GMT
బాబూ ఎంతగా దిగజారి పోయావు..!- ట్విటర్ లో విజయసాయిరెడ్డి

అమరావతి: భర్తలులేనప్పుడు వెళ్లి వాలంటీర్లు తలుపులు కొడతారా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఎంతగా దిగజారిపోయారు బాబుగారు అంటూ విమర్శించారు. వాలంటీర్ల పేర్లు వింటేనే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారంటూ మండిపడ్డారు. మీ పుత్ర రత్నం విదేశీ అమ్మాయిలతో తాగి..తందనాలాడిన ఫొటోలను ప్రజలందరూ చూశారు. అతడినేమో దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. మంది పిల్లలపై నిందలు వేస్తారా అంటూ ట్విటర్ లో చంద్రబాబుపై మండిపడ్డారు విజయసాయిరెడ్డి.Next Story
Share it