బ్రిటన్ సుప్రీం కోర్టుకు విజయ్ మాల్యా
By సుభాష్ Published on 5 May 2020 9:07 AM ISTబ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకూ ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇక చివరి ప్రయత్నంగా బ్రిటన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కాగా, మాల్యాను ఇండియాకు అప్పగించాలంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ర్టేట్ కోర్టు గతంలో వెలువరించిన తీర్పును విజయ్ మాల్యా ముందుగా న్యాయస్థానంలో సవాలు చేశాడు. అయితే విజయ్ మాల్యా అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయస్థానంలో అప్పీలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.
సుప్రీం కోర్టులో విజయ్ మాల్యా వేసిన పిటిషన్‌పై స్పందించేందుకు ఈనెల 14 వరకూ గడువు ఉందని భారత అధికారుల తరపున వాదిస్తున్న న్యాయవాద కౌన్సిల్ యూకే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు ప్రతినిధి తెలిపారు.
కాగా, భారత ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకూ ఎగనామం పెట్టి బ్రిటన్ దేశం పరారైన మాల్యాపై ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ తదితర కేసులు నమోదయ్యాయి.