పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీత గోవిందం.. వంటి చిత్రాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన సెన్సేష‌న్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ హీరో ప్ర‌స్తుతం ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ సినిమా చేస్తున్నాడు. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వ‌లో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

అయితే ఈ సినిమా త‌ర్వాత విజయ్‌ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఫైట‌ర్’ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ మూవీ జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. హైద‌రాబాద్‌తో పాటు విదేశాల్లో షూటింగ్ చేసే ఈ విభిన్న క‌థా చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని సమాచారం. ఈ రెండింటిలో ఒక‌టి మ‌జిలీ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఇక రెండో సినిమాని ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణతో చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2020 లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.