విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ‘పైటర్‌’ మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ హిందీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. పైటర్‌ను తెలుగు, హిందీతోపాటు ఇతర భాషల్లో కూడా రూపుదిద్దుకుంటోంది. పైటర్‌ స్టోరీ పాన్‌ ఇండియాకు అప్పీల్‌ అవుతుందని భావించిన కరణ్‌ జోహార్‌.. పూరి, ఛార్మిలతో కలిసి సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాడు. కాగా, ఈ చిత్రంలో మొదట శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినా.. జాన్వీ కపూర్‌ ఇతర సినిమాల్లో బిజీగా ఉండటంతో నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్యపాండే నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబాయిలో కొనసాగుతోంది.

కాగా, ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా విజయ్‌, అనన్యలపై రాత్రి సమయంలో ముంబాయి రోడ్లపై బైక్‌రైడ్‌ వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్‌ కావడంతో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్‌ ముంబాయి వీధుల్లో జరుగుతోంది. విజయ్‌, అనన్యపై బైక్‌పై చేజింగ్‌ దృశ్యాలను దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్నాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.