విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ స్కెచ్ రెడీ

By Newsmeter.Network  Published on  29 Nov 2019 8:43 AM GMT
 విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ స్కెచ్ రెడీ

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాలో నానితో క‌లిసి న‌టించి.. మంచి న‌టుడు అనిపించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ త‌ర్వాత పెళ్లి చూపులు సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించాడు. తర్వాత అర్జున్‌ రెడ్డితో సంచ‌ల‌న విజ‌యం సాధించి అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకున్నాడు. ఇక గీత గోవిందం సినిమాతో రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

హీరోగా ప‌రిచ‌యం అయిన అన‌తి కాలంలోనే బాగా పాపుల‌ర్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ సినిమాని తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. నెక్ట్స్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్ తో ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఫైట‌ర్ త‌ర్వాత విజ‌య్ 'ప్యాన్ ఇండియా మూవీ' ప్లాన్ చేస్తున్నట్లు సమచారం. దీనికి త‌గ్గ‌ట్టే క‌థ‌ను రెడీ చేయ‌మ‌ని త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ద‌ర్శ‌కుల‌కు విజయ్‌ చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం 'ప్యాన్ ఇండియా మూవీ'కి త‌గ్గ క‌థ‌ను త‌యారు చేయించే ప‌నిలో ఉన్నాడ‌ని తెలిసింది. మ‌రి.. విజ‌య్ తో 'ప్యాన్ ఇండియా మూవీ' చేసే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో..? చూడాలి.

Next Story