అమరావతి: ఎలక్ట్రిక్‌ బస్సులు టెండర్లపై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుబట్టారు. ఆయనకు అప్పుడే కడుపు మంట స్టార్ట్ అయిందంటూ పంచ్‌ వేశారు. ఎలక్ట్రిక్‌ బస్సుల టెండర్లకు 9 సంస్థలు ముందుకు వచ్చాయని ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్ 14న టెక్నికల్, 1న ఫైనాన్షియల్ బిడ్స్ వేయాల్సి ఉంది. అప్పుడే రూ.7,500 కోట్ల క్విడ్ ప్రో జరిగిందని చంద్రబాబుకు కల వచ్చిందంటా..!.ఇంత ఆవేశం మంచిది కాదు బాబూ ..అంటూ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో పంచ్‌లు వేశారు.న్యూస్‌మీటర్ తెలుగు

Next Story