కుర్రాడిలా 'వీహెచ్‌' ధూమ్ ధామ్ స్టెప్పులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 7:31 AM GMT
కుర్రాడిలా వీహెచ్‌ ధూమ్ ధామ్ స్టెప్పులు

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని అని డిపోల ముందు కార్మికులు ధర్మాకు దిగారు. దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న వి.హనుమంతరావు స్టెప్పులేశారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి డ్యాన్స్‌ చేసిన హనుమంతరావు.. కార్మికులను ఉత్సహపరిచారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వీ.హనుమంతరావు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీర్‌ అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేతలు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

Next Story
Share it