వేణుమాధ‌వ్ హాస్ప‌ట‌ల్ బిల్ తలసాని క‌ట్టారా..? ఎందుకు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 7:16 AM GMT
వేణుమాధ‌వ్ హాస్ప‌ట‌ల్ బిల్ తలసాని క‌ట్టారా..? ఎందుకు..?

హైదరాబాద్: ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు వేణుమాధవ్ గ‌త కొన్ని రోజుల‌గా కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతూ బుధ‌వారం మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు వేణుమాధవ్‌. ఆయన మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలా ఉంటే.. వేణుమాధవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు ఆర్పించ‌న ఓ మంత్రి వేణుమాధ‌వ్ హాస్ప‌ట‌ల్ బిల్ కట్టారు.

ఇంత‌కీ.. ఆ మంత్రి ఎవ‌ర‌నుకుంటున్నారా..? తెలంగాణ రాష్ట్ర‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అవును.. ఆయ‌న వేణుమాధవ్ హాస్ప‌ట‌ల్ లో ఉన్నంత వరకూ అయిన బిల్లును చెల్లించారు. అలాగే అంత్యక్రియలకు కావాల్సిన డబ్బు మొత్తం తానే సాయం చేస్తానని చెప్పి రూ.2 లక్షలు సాయం ప్రకటించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ...."వేణుమాధవ్ నాకు తమ్ముడు లాంటి వాడు.వేణుమాధవ్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇండస్ట్రీకి రాక ముందు నుంచి వేణుమాధవ్ నాకు తెలుసు. ఆయన ఎక్కడున్నా అందర్ని నవ్వించేవాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని టాలెంట్‌తో ఈ స్థాయికి వ‌చ్చాడు. సుమారు 600 చిత్రాల్లో నటించి.. నంది అవార్డులు దక్కించుకున్నాడు "అని చెప్పి ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు.

Next Story