'వెంకీ మామ' విష‌యంలో టెన్ష‌న్ ప‌డుతున్న సురేష్ బాబు. అస‌లు ఏమైంది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 10:14 AM GMT
వెంకీ మామ విష‌యంలో టెన్ష‌న్ ప‌డుతున్న సురేష్ బాబు. అస‌లు ఏమైంది..?

విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్యల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. ఈ చిత్రానికి 'జై ల‌వ‌కుశ, ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు, టి.జీ. విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంక‌టేష్ కిషాన్ గా న‌టిస్తుండ‌గా... చైత‌న్య జ‌వాన్ గా న‌టిస్తున్నారు. దేశానికి జ‌వాన్, కిసాన్ ఎంతో అవ‌స‌రమ‌నే వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్ పై రూపొందుతోన్న‌ ఈ క్రేజీ మూవీని ద‌స‌రాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు. సైరా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అయితే... అక్టోబ‌ర్ 4న వెంకీమామ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనేది చిత్ర‌యూనిట్ ప్లాన్. అయితే... చిరంజీవి సైరా సినిమాని దాదాపు 200 కోట్ల‌తో నిర్మించారు. ఈ సినిమాకి పోటీగా రిలీజ్ చేయ‌డం క‌రెక్ట్ కాదు అనే ఉద్దేశ్యంతో వెంకీమామ‌ను వాయిదా వేసారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా బ‌డ్జెట్ 50 కోట్ల దాటేసింద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న సురేష్ బాబు.. టీమ్ పై బాగా ఫైర్ అయ్యార‌ట‌. సినిమాకి హిట్ టాక్ వ‌స్తే... ఫ‌ర‌వాలేదు. ఒక‌వేళ యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా ఇంత మొత్తాన్ని రిక‌వ‌రీ చేయ‌డం చాలా క‌ష్టం. అందుక‌నే ఈ చిత్రాన్ని ఏ సినిమా పోటీ లేన‌ప్పుడు మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట సురేష్ బాబు.

ఏ క్ష‌ణాన్నైనా రిలీజ్ చేయ‌డానికి సిద్ధంగా ఉండాలి. అందుచేత సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని టీమ్ ని ఆదేశించార‌ట. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ బాబీ టీమ్ అదే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని తెలిసింది. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను అక్టోబ‌ర్ 25న రిలీజ్ చేయాలి అనుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి కానీ...తాజా స‌మాచారం ప్రకారం... డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి అనుకుంట‌న్నార‌ట‌. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలిసింది.

Next Story
Share it