విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేష‌న్ లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ క్రేజీ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఈ సినిమాని ఎంత‌గానో ఎంజాయ్ చేస్తుండ‌డంతో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. అయితే.. ఈ సినిమా రిలీజై నాలుగు రోజులే అయినా అప్పుడే పైర‌సీ సీడీ మార్కెట్ లోకి వ‌చ్చేసింది.

జ‌బ్బ‌ర్ ట్రావెల్స్ బ‌స్సులో వెంకీమామ‌ పైర‌సీ ప్రింట్ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా అభిమానులు ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ నుండి మైసూర్ వెళ్లే బ‌స్సులో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీనిపై వెంకీ అభిమానులు, చైతు అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌స్సు డ్రైవ‌ర్ పై ఫైరైన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

ఈ విష‌యాన్ని అభిమానులు చిత్ర యూనిట్ దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ రోజు హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో జ‌రిగిన వెంకీమామ సక్సెస్ మీట్ లో పైర‌సీ సీడీ ప్ర‌ద‌ర్శిస్తున్న ఈ ట్రావెల్ బ‌స్సును ప‌ట్టించిన అభిమానుల‌ను హీరోలు వెంక‌టేష్‌, నాగ చైత‌న్య‌లు ప్ర‌త్యేకంగా అభినందించారు. ఒక సినిమా థియేట‌ర్ లోకి రావాలంటే దాని వెన‌క‌ ఎంతో మంది క‌ష్టం ఉంటుంది. ఇలా పైర‌సీ చేయ‌డం వ‌ల‌న సినిమా ఇండ‌స్ట్రీకి చాలా న‌ష్టం వ‌స్తుంది. ద‌య‌చేసి అంద‌రూ అర్ధం చేసుకుని సినిమాని థియేట‌ర్ లోనే చూడండి. పైర‌సీని ప్రొత్స‌హించ‌కండి అని వెంక‌టేష్‌, నాగ చైత‌న్య ఈ సంద‌ర్భంగా వెంకీమామ సక్సెస్ మీట్ లో తెలియ‌చేశారు.

రాణి యార్లగడ్డ

Next Story