'వెంకీ మామ' ఫస్ట్ సాంగ్ వ‌చ్చేస్తోంది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 11:33 AM GMT
వెంకీ మామ ఫస్ట్ సాంగ్ వ‌చ్చేస్తోంది..!

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తున్నక్రేజీ మల్టీస్టారర్ మూవీ 'వెంకీ మామ'. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై ల‌వకుశ సినిమాల దర్శకుడు కే ఎస్ రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ రైతుగా, నాగ చైతన్య సైనికుడిగా కనిపించబోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో సినిమా పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఇకపోతే ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ని రేపు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్నిఎప్పుడు రిలీజ్ చేయ‌నున్నారో త్వ‌ర‌లో అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు.

Next Story
Share it