వెంకి... నెక్ట్స్ ఏంటి..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 8:27 AM GMT
వెంకి... నెక్ట్స్ ఏంటి..?

విక్ట‌రీ వెంక‌టేష్ 'గురు' సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బ‌ష్ట‌ర్ . ప్ర‌స్తుతం వెంకి... మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి 'వెంకి మామ 'సినిమా చేస్తున్నారు. 'జై ల‌వ‌కుశ' ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం..ప్రస్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. డిసెంబ‌ర్ లో 'వెంకి మామ' రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... వెంకి నెక్ట్స్ మూవి గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... 'పెళ్లి చూపులు' ' ఈ న‌గ‌రానికి ఏమైంది' చిత్రాల ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైరక్షన్‌లో వెంకి ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. వెంక‌టేష్‌ కోసం త‌రుణ్ భాస్క‌ర్ డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రిప్ట్‌ను త‌యారు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ హార్స్ రైడింగ్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని టాలీవుడ్ టాక్‌. ఈ సన్నివేశాల‌ను హైద‌రాబాద్ మ‌ల‌క్‌పేట‌లోని రేస్ కోర్స్‌లో చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది.

'పెళ్ళిచూపులు' చిత్రంతో దర్శ‌కుడిగా విజ‌యం సాధించిన త‌రుణ్ భాస్క‌ర్' ఈ న‌గరానికి ఏమైంది' సినిమాతో క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అందుకోలేకపోయారు. అయితే...ప్ర‌స్తుతం వెంకి కోసం ఈ డిఫ‌రెంట్ స్టోరీని రెడీ చేస్తున్నార‌ట‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

Next Story
Share it