ముఖ్యాంశాలు

  • వీడియో రిలీజ్ చేసిన కేఏ పాల్
  • ఆ వీడియోను ట్వీట్ చేసిన దర్శకుడు వర్మ
  • మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటున్న పాల్

బాగుంది..ఆయన చెప్పారు..ఈయన ట్విట్ చేశారు. కేఏ పాల్ తెలుసుగా. తెలియకపోతే మనం తెలుగు వాళ్లమే కాదు. ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశాడు. కొన్ని ఛానళ్లు పాల్ ను బాగాను ప్రమోట్ చేశాయి. ప్రజాశాంతి పార్టీ పేరుతో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆయన పార్టీ కలర్ కండువా ..వైఎస్ఆర్ సీపీ కండువాను పోలి ఉంటుంది. పార్టీ సింబల్ హెలి కాప్టర్ దీనిలో విచిత్రం ఏముందీ అనుకుంటున్నారా? హెలికాప్టర్ రెక్కల్ ..వైఎస్ఆర్ సీపీ సింబల్ ఫ్యాన్ ను పోలి ఉంటాయి.

ఇక విషయంలోకి వద్దాం. ఎన్నికలు తరువాత పాల్ ఎక్కడున్నారో, ఎక్కడికి పోయారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు షడన్ గా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోను దర్శకుడు వర్మ ట్విట్ చేశాడు. ఆ వీడియోలో పాల్ మూడో ప్రపంచ యుద్ధం వస్తదని హెచ్చరిస్తున్నాడు. దీనికి సంబంధించి ట్రంప్ కు లేఖ రాస్తానని చెబుతున్నాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.