చంద్రబాబు , లోకేష్‌ను ఎటాక్ చేసిన వల్లభనేని వంశీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 1:15 PM GMT
చంద్రబాబు , లోకేష్‌ను ఎటాక్ చేసిన వల్లభనేని వంశీ..!

ఏపీలో టీడీపీకి అండగా ఉండే జిల్లాలు గుంటూరు, కృష్ణా జిల్లాలు. ఈ రెండు జిల్లాలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువుగా ఉండటంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు ఉన్నారు. అందుకే ఈ జిల్లాల్లో టీడీపీ ఎప్పుడు బలంగా ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో ఆ రెండు జిల్లాలోనూ ...టీడీపీ ఘోరంగా దెబ్బతింది. కానీ ఆ జిల్లాల్లో ఉన్న టీడీపీ బలమైన నేతలను ఆకర్షించడమే లక్ష్యంగా ....వైసీపీ ఆకర్ష్ మొదలుపెట్టిందనే వాదనలు ఇటీవల తెరపైకి వచ్చాయి. అదే నిజమైతే వైసీపీ పావులు పారుతున్నాయని చెప్పాలి. అధికార పార్టీ చర్యలను ఖండిస్తూ ఇసుక కొరతను నిరసిస్తూ .....స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలో దీక్ష నిర్వహిస్తున్న రోజే టీడీపీకి షాకిచ్చి వెళ్లిపోయారు. టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు...రాంరాం చెప్పారు. పార్టీతో మేం పడలేమని తేల్చిచెప్పారు. ఆ ఇద్దరి నేతల్లో ఒకరు వల్లభనేని వంశీ కాగా...మరొకరు దేవినేని అవినాశ్. వల్లభనేని గతంలోనే పార్టీకి రాజీనామా చేసి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ గురువారం రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.

ఇక...తాను పార్టీ మారడానికి నేరుగా చంద్రబాబు పుత్రరత్నమే కారణమంటూ పెద్ద బాంబు పేల్చాడు వల్లభనేని వంశీ. దేవినేని ఉమా కూడా కారణమేనని చెప్పేసి అందర్నీ షాక్ కు గురి చేశాడు. జయంతి, వర్ధంతికి తేడా తెలియనవాళ్లు పార్టీని నడుపుతున్నారంటూ.... లోకేశ్ పై సెటైర్లు విసిరారు. లోకేశ్ బాబు నాయకత్వంలో నడుస్తున్న కొన్ని వెబ్ సైట్లు....తన గురించి అసత్య ప్రచారాలు చేశాయని కుండబద్ధలు కొట్టారు. తన గురించి ఎవరు రాస్తున్నారు...ఆ రాతలు వెనుక ఉన్నారో తెలసుకోలేనంత అమాయకుడ్ని తాను కాదని చెప్పారు. బ్లాక్ బెయిల్ ద్వారా నేతలను పార్టీలో ఉంచాలనుకోవడం అవివేకమన్నారు. భయపెట్టి పార్టీలో ఎవర్నీ ఉంచలేరంటూ నేరుగా పార్టీకే కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే వైసీపీలో చేరతానని చెప్పారు. అప్పటి వరకు బయట నుంచి వైసీపీకి మద్దతిస్తానని స్పష్టం చేశారు. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు అండ్ కోనే కారణమని తేల్చిచెప్పారు.

ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు తెలంగాణ ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొనలేదా అని నిలదీశారు వంశీ. పవన్ కల్యాణ్ ఏపీలో మాత్రమే ప్రశ్నిస్తారా....తెలంగాణలో మాట్లాడరా అని నిలదీశారు. ఏపీలోనే ఆయనకు ఫ్యాన్స్, పార్టీ క్యాడర్ ఉందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీసీలో చేరేంత వరకు టీడీపీ ఎమ్మెల్యేగానే ఉంటానని....దాని వల్ల ఎదురయ్యే టెక్నీకల్ ఇష్యూస్ ను ఎదుర్కొంటానని తేల్చిచెప్పారు. వంశీ గన్నవరం శాసనసభ పదవికి రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అసాధ్యమనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో వల్లభనేని చాలా కష్టంగా గెలిచాడు. అతి తక్కువ మెజార్టీతో బయటపడ్డాడు. పార్టీ ఇమేజ్ కంటే సొంత ఇమేజ్ వల్లే వంశీ గెలిచాడని అంటారు చాలా మంది. మరి అలాంటి వ్యక్తి వైసీపికి వెళ్తే....ఆ తాకిడిని తట్టుకోవడం చాలా కష్టం.

Next Story