వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నాడా?.. ఆ పోస్ట్‌ వెనుక ఉద్దేశమేంటి.!

By సుభాష్  Published on  16 April 2020 2:45 PM GMT
వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నాడా?.. ఆ పోస్ట్‌ వెనుక ఉద్దేశమేంటి.!

ఏపీలో రాజకీయాల గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. ఎప్పుడు ఏదో ఒకటి రాజుకుంటూనే ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రతీ అంశంపై రగడ జరుగుతుందంటే అది ఏపీలోనే. ఇక ఏపీ రాజకీయాల్లో వల్లభననేని వంశీ పేరు అందరికి సుపరిచితమే. రాజకీయాల్లో వల్లభనేని అంటే తెలియనివారుండరు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు గన్నవరం నుంచి తిరుగులేని నేతగా ఎదిగారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ పార్టీకి షాకిచ్చారు. అప్పట్లో చంద్రబాబుపై చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి.

ఇక అదే సంవత్సరంలో నేను పార్టీ నుంచి వీడుతున్నా... రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, సీఎం జగన్‌ను కలిశారు. అయినా వైసీపీలోనేమి చేరలేదు. కొంత కాలం తర్వాత వంశీ వ్యవహారం సద్దుమణిగింది. కానీ ఏప్రిల్‌ 16న ఆయన ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

'' పద్నాలు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు'' అంటూ పోస్టు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టును చూస్తుంటే రాజకీయాలకు గుడ్‌బై చెప్పుబోతున్నారేమోననే అనుమానం నేతల్లో కలుగుతోంది.

Next Story