వంశీ.. మెగా కాంపౌండ్‌లో మ‌రో సినిమా చేస్తున్నాడా..?

By Newsmeter.Network  Published on  28 Nov 2019 6:20 AM GMT
వంశీ.. మెగా కాంపౌండ్‌లో మ‌రో సినిమా చేస్తున్నాడా..?

వ‌క్కంతం వంశీ రైట‌ర్ గా స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా తొలి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నాడు. చాలా రోజులు వెయిట్ చేశాడు. ఆఖ‌రికి ఎన్టీఆర్ తో వ‌క్కంతం వంశీ సినిమా అంటూ ఎనౌన్స్ మెంట్ కూడా వ‌చ్చింది. కానీ.. ఏమైందో ఏమో.. ఆ సినిమా ఆగిపోవ‌డం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అవ‌కాశం ఇవ్వ‌డం.. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాగా రావ‌డం తెలిసిందే.

అయితే.. ద‌ర్శ‌కుడిగా స‌క్స‌స్ సాధించాలి అని ఎంతో క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు. ఈ సినిమా స‌క్సస్ కాక‌పోయినా వంశీ మాత్రం మెగా కాంపౌండ్ ని వ‌ద‌ల్లేదు. ఆ త‌ర్వాత గీతా ఆర్ట్స్ నిర్మించే సినిమాల స్క్రిప్టులు చూడ‌డం.. అందులో చేయాల్సిన మార్పులు చెప్ప‌డం.. క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొన‌డం.. ఈవిధంగా త‌న వంతు స‌హ‌కారాన్ని అందించాడు.

వంశీ పై అల్లు అర‌వింద్ కి న‌మ్మ‌కం ఉండ‌డంతో క‌థ రెడీ చేసుకోమ‌ని చెప్పినట్లు తెలుస్తోంది‌. ఇటీవ‌ల వంశీ అల్లు అర‌వింద్ కి క‌థ చెప్ప‌డం.. న‌చ్చ‌డంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని సమాచారం. ఇందులో మెగా హీరో న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి.. ఆ మెగా హీరో ఎవ‌రో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Next Story