రోగ నిరోధక శక్తిని పెంచుతున్న వ్యాక్సిన్‌.. ఇక మనుషులపై ప్రయోగమే తరువాయి..

By Newsmeter.Network  Published on  3 April 2020 10:22 AM GMT
రోగ నిరోధక శక్తిని పెంచుతున్న వ్యాక్సిన్‌.. ఇక మనుషులపై ప్రయోగమే తరువాయి..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ మహమ్మారి విజృంభణతో 205 దేశాలు అతలాకుతలమవుతున్నాయి. రోజు రోజుకు వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య 10 లక్షలు దాటగా.. 51,299 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్‌ సోకిన వారిలో రోగ నిరోధక శక్తి క్రమంగా క్షీణించి వ్యక్తి మరణిస్తున్నారు. రోగనిరోధక శక్తి సామర్థ్యాన్ని బట్టి ఈ వైరస్‌ లక్షణాలు బయటపడుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు ఈ వైరస్‌ భారిన అధికంగా పడుతున్నట్లు ఇప్పటికే అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో ప్రభుత్వాలు సైతం 10లోపు చిన్న పిల్లలు, 50 నుంచి 60ఏళ్లలోపు పైబడిన వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నాయి.

Also Read :ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినం.. ఎందుకంటే..?

ఈ వైరస్‌ భారిన పడుతున్న వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. ఇదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు.. తద్వారా వైరస్‌ సోకిన వ్యక్తి మరల రికవరీ అయ్యేలా అధ్యయనాలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని దేశాలు కోరనా వైరస్‌ విరుగుడుకు వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా ఓ అడుగు ముందుకేసింది. వైరస్‌ మానవ శరీరంలో చొరబడ్డ తరువాత రోగ నిరోధక శక్తిని తగ్గించి ప్రాణాలు పోయేలా చేస్తాయి.. ఇదే కోణంలో పరిశోధనలు జరిపిన అమెరికా పరిశోధన సంస్థ పిట్స్బర్గ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు ఈబయో మెడిసిన్‌ జర్నల్‌ కథనం ప్రచురింది.

Also Read : రూ. 1.25 కోట్ల విరాళం అందజేసిన బాలయ్య

ఈ ప్రయోగాన్ని తొలుత ఎలుకలపై ప్రయోగించారు. మానవ శరీరంతో చాలా దగ్గర జన్యుపరమైన పోలికలు ఎలుకలో ఉంటాయి. దీంతో తొలుత ఎలుకపై ప్రయోతాత్మకంగా పరీక్ష చేశారు. ఎలుకలోకి వైరస్‌ను ప్రవేశపెట్టారు. ఇంజెక్షన్‌ ద్వారా యంటీబాడీస్‌ను కూడా పంపించారు. రెండు వారాలు పోరాడిన ఎలుక రోగ నిరోధక శక్తి పెరగడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ విషయాన్ని అమెరికాలోని పిట్స్బర్గ్‌ యూనివర్శిటీకి చెందిన ఆండ్రూ గాంబొట్టో తెలిపారు. కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలిసిందని తెలిపారు. ఎలుకలపై చేసిన ప్రయోగం సక్సెస్‌ కావడంతో ఇక మనుషులపై చేసేందుకు సిద్ధమవుతున్నామని గాంబొట్టో అన్నారు. గామా రేడియేషన్‌లో దీన్ని రెడీ చేస్తామని, మనుషులపై ప్రయోగించడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చని తెలిపాడు. కాకపోతే ఇప్పటి వరకూ వాడుతున్న మెడిసిన్ల కంటే వైరస్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రస్తుత వ్యాక్సిన్‌ వేగవంతంగా పనిచేయగలదని ధీమా వ్యక్తంచేశారు.

Next Story