కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన మోడెర్నా బయోటెక్ సంస్థ..కానీ

By రాణి  Published on  4 March 2020 12:51 PM GMT
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన మోడెర్నా బయోటెక్ సంస్థ..కానీ

చైనాలోని వుహాన్ నుంచి వ్యాపించిన కరోనా వైరస్..ఇప్పుడు ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఎవరిని తాకాలన్నా, మాట్లాడాలన్నా..చివరికి కలిసి భోజనం చేయాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది. భార్య, భర్తలు కలుసుకునేందుకు కూడా కరోనా అడ్డొస్తోంది. చైనాలో ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్న కరోనా..ఇరాన్ లో 93 మందిని తన మృత్యు ఒడిలోకి చేర్చుకుంది. తాజాగా ఈ వైరస్ తెలుగు రాష్ర్టాలకు వ్యాపించి..అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

ఇంతలోనే అమెరికాలోని మోడెర్నా బయోటెక్ సంస్థ కరోనాకు తొలిసారిగా వ్యాక్సిన్ ను కనుగొన్నట్లు ప్రకటించింది. కరోనాకు మందును కనిపెట్టేందుకు చాలా మంది శాస్ర్తవేత్తలు కృషి ఫలితం ఇన్నాళ్లకు కనిపించింది. కరోనాకు నివారణ మందు కనిపెట్టినట్లు ఆ సంస్థ తెలిపింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ఇన్‌ఫెక్షన్స్‌కు ఎంఆర్‌ఎన్‌ఎ-1273 పేరిట తయారైన ఈ వ్యాక్సిన్‌ను ఏప్రిల్ లో మనషులపై ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపింది. కానీ..వ్యాక్సిన్ ప్రయోగం పూర్తయి..దానికి అనుమతులు వచ్చే సరికి కనీసం ఏడాది సమయం పట్టవచ్చని అనుమానం వ్యక్తం చేసింది సదరు బయోటెక్ సంస్థ.

Next Story