వి టీజర్.. ట్రైలర్.. ఈ తేడా గమనించారా?
By సుభాష్ Published on 29 Aug 2020 12:32 PM ISTఅగ్ర నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ టాలీవుడ్లో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఈ బేనర్ పేరు పడటానికి ముందు శ్రీమతి అనిత సమర్పించు అని టైటిల్స్‌లో కచ్చితంగా పడుతుంది. ఇది రెండు దశాబ్దాల కిందట్నుంచి ఉన్న ఆనవాయితీ. దిల్ రాజు కొత్త సినిమా వి టీజర్ రిలీజైనపుడు కూడా అనిత పేరు పడింది. అది దిల్ రాజు భార్య పేరన్న సంగతి తెలిసిందే. ఐతే ఆమె కొన్నేళ్ల కిందట మరణించారు. ఆ తర్వాత కూడా అనిత పేరు టైటిల్స్‌లో కొనసాగుతోంది. కానీ తాజాగా రిలీజ్ చేసిన వి ట్రైలర్లో మాత్రం అనిత పేరు కనిపించలేదు. నేరుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే వేశారు. సమర్పణ తీసేశారు.
రాజు కొన్ని నెలల కిందటే తేజస్వి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటి భార్య పేరును సమర్పకురాలిగా వేయడం బాగుండదని తీసేసినట్లున్నాడు రాజు. ఈ సంగతలా ఉంచితే.. లాక్ డౌన్ టైంలో ఇప్పటిదాకా చిన్నా చితకా చిత్రాలే నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. వేరే భాషల్లో పెద్ద సినిమాలు వచ్చినా.. తెలుగు నిర్మాతలు మాత్రం ధైర్యం చేయలేదు. ఐతే రాజే ఈ విషయంలో ముందడుగు వేశారు. తన వి సినిమాను అమేజాన్ ప్రైమ్ వాళ్లకు ఇచ్చేశాడు. రూ.32 కోట్లకు ఈ సినిమా అమ్ముడైనట్లు చెబుతున్నారు. సెప్టెంబరు 5న ఈ సినిమాకు ప్రిమియర్స్ పడుతున్నాయి. దీనికి మంచి స్పందన వస్తే.. టాలీవుడ్లో ఒక గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేథా థామస్ ప్రధాన పాత్రలు పోషించారు.