ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఆత్మ మ‌మ్మ‌ల్ని అంద‌రినీ క‌లిపింది - రామ్ చ‌ర‌ణ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 8:45 AM GMT
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఆత్మ మ‌మ్మ‌ల్ని అంద‌రినీ క‌లిపింది - రామ్ చ‌ర‌ణ్‌

సైరా సినిమా విడుద‌లైన అన్ని చోట్లా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో నిర్మాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ... సినిమా గురించి చెప్పాలంటే... ఎప్పుడు, ఎక్క‌డ మొద‌లు పెట్టాలో తెలియ‌డం లేదు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌ను తీసుకొచ్చిన ప‌దేళ్ల క్రితం మొద‌లు పెట్ట‌లా? లేక మూడేళ్ల ముందు నుండి మొద‌లు పెట్టాలా? అని అర్థం కావ‌డం లేదు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఆలోచ‌న‌లు చాలా గొప్ప‌గా ఉంటాయి. సాయిమాధ‌వ్ బుర్రాకి థ్యాంక్స్‌. క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌తో మ‌గ‌ధీర స‌మ‌యంలో ప‌నిచేశాను. ఇప్పుడు మ‌ళ్లీ ప‌నిచేశాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయ‌న వి.ఎఫ్‌.ఎక్స్ చేశారు. ర‌త్న‌వేలుతో ఖైదీ నంబ‌ర్ 150, రంగ‌స్థ‌లం సినిమా నుండి ట్రావెల్ ఉంది. ప్రతి సీన్‌ను ఎంతో గొప్ప‌గా చిత్రీక‌రించారు.

అలాగే రాజీవన్‌తో ధృవ సినిమాకు ప‌నిచేశాను. ఈ సినిమా కోసం 40 సెట్స్ వేశారు. ఆయ‌న క‌ష్టానికి థ్యాంక్స్‌. జ‌గ‌ప‌తిబాబు లాంటి మోస్ట్ బ్యూటీఫుల్ ప‌ర్స‌న్ ఈ సినిమాలో భాగ‌మైనందుకు ఆయ‌న‌కు థ్యాంక్స్‌. న‌య‌న‌తార‌కి, త‌మ‌న్నాకి థ్యాంక్స్‌. ఇంత మంచి రిలీజ్ ఇచ్చిన మా డిస్ట్రిబ్యూటర్స్ అంద‌రికీ థ్యాంక్స్‌. డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌తో ప‌నిచేయడం హ్యాపీ. ఆయ‌న ప్రొడ్యూస‌ర్స్ డైరెక్ట‌ర్‌. ఈ స‌క్సెస్‌ను మేం ఊహించ‌లేదు. క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. ఓ నెల‌న్న‌ర స‌మ‌యంగా నేను రాత్రి మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో ఉలిక్కిప‌డి నిద్ర‌లేచేవాడిని.

రాజ‌మౌళి , తార‌క్ ఏంట‌బ్బాయి స్ట్రెస్‌లో ఉన్నావ‌ని అంటే.. ఉన్నానో, ఉండి ఉండొచ్చో ఏమో నాకు తెలియ‌లేదు. ఓ టెన్ష‌న్ ఉండేది. అయితే ఉయ్యాల‌వాడ ఆత్మ మ‌మ్మ‌ల్ని అంద‌రినీ క‌లిపింది. నాన్నగారితో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసే అవ‌కాశం క‌లిగించింది. చాలా క్ర‌మ‌శిక్ష‌ణతో చేశాం. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నాన్న‌కి థ్యాంక్స్‌. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ అయిన సురేంద‌ర్ రెడ్డిగారు ప‌క్క‌న పెట్టి ఈ సినిమా చేస్తే.. నాన్న‌ త‌న ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి ఈ సినిమా చేశారు. భార‌తీయ సినిమాల్లో గ‌ర్వ‌ప‌డే చిత్రమిది. స‌పోర్ట్ అందించిన అంద‌రికీ థ్యాంక్స్‌ అన్నారు.

Next Story