హుజూర్‌ నగర్‌: కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో ఈ సీటును పద్మావతి రెడ్డి భర్త ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గెలుచుకున్నారు. అయినా..నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో హుజూర్‌ నగర్‌లో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో..కాంగ్రెస్‌ అధిష్టానం ఉత్తమ్‌ భార్య పద్మావతి రెడ్డికి టికెట్ ఖరారు చేసింది. అందరికంటే ముందుగానే ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించింది.హుజూర్‌ నగర్‌లో ఉత్తమ్‌ కుటుంబానికి మంచి పట్టు ఉందనే సంగతి తెలిసిందే. నామినేషన్ వేసే సమయంలో పద్మావతి రెడ్డితో టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి కూడా ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.