ట్రంప్ పదవి పోతుందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 6:04 AM GMT
ట్రంప్ పదవి పోతుందా?

అమెరికా చరిత్రలో ఈ అభిశంసన మొదటిదమీ కాదు. తాజాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిరోజు బహిరంగ విచారణను అక్కడ టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని 13.8 మిలియన్ల అమెరికన్లు వీక్షించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలలో తన విజయావకాశాలు మెరుగు పరుచుకోవడం కోసం ట్రంప్ అక్రమంగా ఉక్రెయిన్ సాయం అభ్యర్తించారన్న ఆరోపణల కేంద్రంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

111

అయితే 2020 ఎన్నికలలో డెమోక్రటిక్ నేత, మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ నుంచి ట్రంప్ కు గట్టి పోటీ అని చెప్పోంచు. దీంతో జోసెఫ్ ను దెబ్బకొట్టేందుకు ట్రంప్ ఉక్రెయిన్ సహాయం కోరినట్టు ఆరోపణలు వచ్చాయి. బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ గతంలో ఒక గ్యాస్ సంస్థలో పనిచేశారు. ఇప్పుడు జూనియర్ బిడెన్ అవినీతిపై విచారణ జరిపి తనకు సహాయం చేయాలని ట్రంప్‌ కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమర్ జెలెన్ స్కీ ని ట్రంప్ ఫోన్ లో కోరారని గుర్తు తెలియని ఒక నిఘా అధికారి హౌస్ ఇంటలిజెన్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

Trump

తర్వాత వైట్ హౌస్ ఆ ఫోన్ సంభాషణలను బహిర్గతం చేసింది. జో బిడెన్, హంటర్ బిడెన్ లపై విచారణ చేపట్టాలంటూ కోరిన సమాచారం అందులో ఉంది. అందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించేందుకు కూడా ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ విషయాలన్నీ బహిర్గతం కావడంతో ట్రంప్ అధ్యక్ష పదవికి, దేశభద్రతకు, ఎన్నికల విశ్వసనీయతకు చేటు తెచ్చారంటూ డెమొక్రాట్ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యసంశన ప్రక్రియకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.

ఈ మేరకు మొదటి రోజు విచారణ జరిగింది. దీనిలో ఉక్రెయిన్ తాత్కాలిక రాయబారి విలియన్ బీ టైలర్ జూనియర్, యూరోపియన్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జార్జ్ కెంట్, ఉక్రెయిన్ కి మాజీ అమెరికా రాయబారి మేరీ మాషా తమ వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ ప్రక్రియను 13 మంది డెమోక్రాట్లు తొమ్మిది మంది రిపబ్లికన్లు మొత్తం 22 మంది హౌస్ నంబర్లతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుంది.

అయితే గతంలో బిల్ క్లింటన్, ఆండ్రు జాన్సన్ లు ఇద్దరూ అభిశంసనలు ఎదుర్కొన్నారు. అయితే సెనేట్లో ఈ తీర్మానాలు వీగిపోయాయి. ఇక రిచర్డ్ నిక్సన్ పైన అభిశంసన ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో అతను ముందుగానే రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు.

ప్రస్తుతం అధ్యక్షుడైన ట్రంప్ చేసిన నేరాలకు తగిన ఆధారాలు ఉంటే ఓటింగ్ నిర్వహిస్తారు. మెజారిటీ నిర్ణయంతో ట్రంప్ అభిశంసనకు గురవుతారు. అయితే అధ్యక్ష పదవికి అప్పుడే వచ్చిన సమస్య ఏమీ ఉండదు. రెండవ దశలో అభియోగాలపై విచారణ జరిపి ఓటింగ్ నిర్వహిస్తుంది. సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సభ్యులు దోషి అని తేల్చినప్పుడు మాత్రమే ట్రంప్ తన అధ్యక్ష పదవిని కోల్పోతారు.

అయితే ప్రస్తుతం సెనేట్ లో ట్రంప్ సొంత పార్టీదే ఆధిపత్యం. ఆయన పదవిని కోల్పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ కోల్పోతే ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

Next Story