భీమవరం చిరు అభిమానులకు థాంక్స్ చెప్పిన ఉపాసన..ఎందుకు థాంక్స్ ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 12:59 PM GMT
భీమవరం చిరు అభిమానులకు థాంక్స్ చెప్పిన ఉపాసన..ఎందుకు థాంక్స్ ?

ప్ర‌స్తుతం ఎవ‌రి నోట విన్నా 'సైరా'మాటే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ దిశ‌గా అడుగులు వేస్తూ.... 'సైరా 'స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. తెలుగు సినిమా స‌త్తాను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పారు అంటూ 'సైరా' యూనిట్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా తెర‌మ‌రుగైన తెలుగు వీరుడి క‌థ‌ను తెర‌కెక్కించి తెలుగోడి స‌త్తా తెలియ‌చెప్పారు అంటూ అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే... చిరంజీవి కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న భీమవరం మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.... భీమవరంలో చిరు అభిమానులు 250 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు. దాదాపు అర కిలోమీటర్ వరకు బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్ ను ఉపాసన తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా ఏమ‌న్నారంటే... మెగాస్టార్ సాధించారు. అతడు నిజమైన గ్యాంగ్ లీడర్. 'సైరా నరసింహారెడ్డి 'చిత్రం తండ్రికి కొడుకు ఇచ్చిన అల్టిమేట్ గిఫ్ట్. మెగాస్టార్ కోడలిగా గర్విస్తున్నా... రామ్ చరణ్ భార్యగానూ గర్వంగా ఉంది అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

Next Story
Share it