బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. 27 మందికి తీవ్ర గాయాలు

By సుభాష్  Published on  17 Oct 2020 3:03 AM GMT
బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. 27 మందికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిలిభిత్‌ జిల్లా జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలిభిత్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిలిభిత్‌ డిపో నుంచి లక్నోకు బయలుదేరిన బస్ను బోలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా, మరో ఏడుగురు తీవ్రంగా, మరో 24 మంది స్వల్పంగా గాయపడటంతో జిల్లా తస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది, బోలెరో వాహనంలో 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయితే తీవ్రంగా గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బొలెరో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం, వాహనం అతి వేగంగా ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.

Next Story
Share it