అన్ని కరోనా వైరస్ లకు ఒకటే వ్యాక్సిన్ రాబోతోందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Aug 2020 3:57 PM GMT
అన్ని కరోనా వైరస్ లకు ఒకటే వ్యాక్సిన్ రాబోతోందా..?

చైనా పరిస్థితి ఏమో కానీ ప్రపంచమంతా మాత్రం ఒకే ఒక్క గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తోంది.. అదేమిటంటే 'కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసింది' అని..! కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనుక్కునే పనిలో ప్రపంచ దేశాలు నిమగ్నమై ఉన్న సమయంలో.. అన్ని కరోనా వైరస్ లకు ఒకటే వ్యాక్సిన్ రాబోతోందనే వార్త చాలా మందిలో ఆశలు రేకెత్తిస్తోంది.

కేంబ్రిడ్జి యూనివర్సిటీ అన్ని రకాల కరోనావైరస్‌లకు ఒకే వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషుల నుంచి వ్యాపించే అవకాశం ఉండడంతో.. అలా వ్యాపించే అన్ని రకాల వైరస్‌లకు ఒకే వ్యాక్సిన్ తయారు చేస్తే భవిష్యత్తులో ఈ వైరస్ వలన ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు అతి తక్కువ అని భావిస్తూ ఉన్నారు. DIOS-CoVax2 అంటూ దీనికి పేరు పెట్టారు.

పలు రకాల కరోనా వైరస్ లను ఇప్పటికే కనుక్కున్నారు.. వీటిలో మనల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్న వైరస్ నావల్ కరోనా వైరస్ అన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ల జనిటిక్ క్రమాన్ని అంచనా వేసి దానికి మందును కనిపెట్టాలని భావిస్తూ ఉన్నారు. కోవిడ్ 19 పరిణామక్రమాన్ని అధ్యయనం చేయనున్నారు. సార్స్, మెర్స్ లాంటి కరోనా వైరస్‌లను కూడా పరిశీలించనున్నారు. DIOS-CoVax2 కరోనా నుండి మనుషులను రక్షించే ఔషధం అవుతుందా.. లేదా అని తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనేమో..!

ఈ వ్యాక్సిన్ అన్ని ట్రయల్స్ ను పూర్తీ చేసుకుని వస్తే నొప్పి లేకుండా స్ప్రింగ్ పవర్డ్ జెట్ ఇంజెక్షన్ ద్వారా మనుషులకు ఇవ్వనున్నారు.

Next Story