డిపో మేనేజర్ ను ముసుగేసి కొట్టారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 6:56 AM GMT
డిపో మేనేజర్ ను ముసుగేసి కొట్టారు..!

ఆదిలాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరో వైపు మంగళవారం అర్థరాత్రి లోపు ఆర్టీసీ విధుల్లో చేరాలని కార్మికులకు కేసీఆర్‌ డేడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆర్టీసీ విధుల్లో చేరడానికి వెళ్తున్న భైంసా డిపో మేనేజర్‌ జనార్దన్‌పై ముసుగు వేసి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

Adb1

ఈ దాడిలో జనార్దన్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతనని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా జనార్దన్‌పై జరిగిన మూక దాడిని ఆర్టీసీ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఖండించింది.

దాడి చేసిన వాళ్లను గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలని ఆర్టీసీ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కృష్ణకాంత్‌ అన్నారు.

Next Story
Share it