పేరు చెప్పకుండా కంగనాకు ఉద్ధవ్ థాక్రే కౌంటర్ వేశారే..!

By సుభాష్  Published on  8 Sep 2020 4:10 AM GMT
పేరు చెప్పకుండా కంగనాకు ఉద్ధవ్ థాక్రే కౌంటర్ వేశారే..!

ముంబై తనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా తలపిస్తోందంటూ బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..! ఆమె చేసిన వ్యాఖ్యలను చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు, పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు.

తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కంగనా రనౌత్ కు కౌంటర్ వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ 'జీవితాన్ని ఇచ్చిన నగరంపై కృతజ్ఞత భావం చూపకపోవడం కొందరి లక్షణం' అని ఆయన అన్నారు. ఇటీవల మరణించిన శివసేన ఎమ్మెల్యే అనిల్ రాథోడ్ గురించి ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ 'కొందరు ముంబై నగరం పట్ల ఎంతో కృతజ్ఞత చూపిస్తారు.. మరికొందరు బ్రతకడానికి దారి చూపిన నగరంపై కృతజ్ఞత ప్రదర్శించారు' అని అన్నారు. అనిల్ భయ్యా(అనిల్ రాథోడ్) రాజస్థాన్ నుండి వచ్చినప్పటికీ మాహారాష్ట్రను సొంత ఇంటిలా భావించాడు. ఆయన శివ సైనికుడిగా ఎంతో పాటుపడ్డారని ఉద్ధవ్ థాక్రే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటి కంగనా రనౌత్ కు శివసేన నాయకులకు మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శివసేన, కంగనాకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముంబైలో అడుగుపెట్టొందంటూ శివసేన నేతలు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై లోని కంగనా రనౌత్ కార్యాలయంపై మున్సిపల్ అధికారులు దాడులు చేయడంపై కంగనా స్పందించింది. నా ఆఫీసులోకి ఈరోజు బలవంతంగా మున్సిపల్ అధికారులు చొరబడ్డారు.. భవిష్యత్తులో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తారేమో అని ఆమె ఆరోపణలు గుప్పించారు. 'బీఎంసీ అధికారులు నా ఆఫీసులోకి బలవంతంగా చొరబడ్డారు. కొలిచి చూడడమే కాకుండా.. పొరుగున ఉన్న వారిని కూడా టార్చర్ పెట్టారు. ఆ మేడమ్ చేసిన పనికి మీరంతా అనుభవిస్తారని' వారిని బెదిరించినట్లు కంగనా ట్వీట్ చేసింది. అన్ని పేపర్లు ఉన్నాయి.. బీఎంసీ అనుమతులు కూడా ఉన్నాయి.. ఒక్క ఇల్లీగల్ విషయం కూడా లేదు.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, స్ట్రక్చర్ ప్లాన్ కూడా తీసుకురాకుండా అధికారులు ఈరోజు తన కార్యాలయానికి వచ్చారని తెలిపింది.

Next Story