షకీబ్‌పై రెండేళ్లు వేటు..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 Oct 2019 8:42 PM IST

షకీబ్‌పై రెండేళ్లు వేటు..!

దుబాయ్: బంగ్లాదేశ్ కీలక ఆటగాడు షకిబ్‌పై ఐసీసీ వేటు వేసింది. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడకుండా రెండేళ్లు నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం మోపిన అభియోగాలను షకిబ్ అంగీకరించాడు. ఒక్క ఏడాది పూర్తిగా నిషేధం, మరో ఏడాది సప్పెన్షన్ చేశారు.

2018 జనవరిలో జరిగిన బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు సిరీస్‌లో షకిబ్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయాన్ని షకిబ్ ఐసీసీకి చెప్పలేదు. దీంతో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. 2018 ఐపీఎల్ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించడాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లలేదు షకిబ్. తన తప్పును షకిబ్ అంగీకరించాడు. నిషేధంతో వచ్చే ఏడాది ఐపీఎల్, టీ 20 ప్రపంచ కప్‌లకు దూరమవుతాడు.

Next Story