పలకని ట్విట్టర్ పిట్ట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 8:31 AM GMT
పలకని ట్విట్టర్ పిట్ట

సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది ట్విట్టర్. ప్రపంచంలోని సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అందరూ ట్విట్టర్ వేదికగా సందడి చేస్తుంటారు. అయితే.. ఐఎస్టి కాల‌మానం ప్రకారం, అక్టోబర్ 2 ఉదయం నుండి ట్విట్టర్ స్తంభించిపోయింది. మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. న్యూజిలాండ్ మొదలుకుని నార్త్ అమెరికా దాకా ఇదే పరిస్థితి నెలకొంది.

నాలుగైదు గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి నాలుగు వేలకు పైగా రిపోర్టులు అందినట్లు ట్వీట్ డెస్క్ వెల్లడించింది. సాంకేతిక లోపాల కారణంగానే తమ సేవలు నిలిచిపోయాయని వెల్లడించింది. త్వరలోనే దాన్ని సరి చేస్తామని పేర్కొంది.

జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, భారత్, దక్షిణ కొరియా, ఇరాన్, ఈజిప్ట్, ఆఫ్రికా, ఐరోపా ఖండంలోని కొన్ని దేశాలు, గ్రీన్ ల్యాండ్, బ్రిటన్, బెల్జియం, కొలంబియా, అర్జెంటీనా, కరేబియన్ దీవులు, మెక్సికో, నార్వే, డెన్మార్క్ ల్లోని పలు ప్రాంతాల్లో ట్విట్టర్ స్తంభించినట్లు ట్వీట్ డెస్క్ వెల్లడించింది. యుద్ధ ప్రాతిపదికన దీన్ని సరి చేస్తున్నట్లు వెల్లడించింది.

Next Story