హైదరాబాద్: నిన్న సాయంత్రం సింగారావు ఇచ్చిన ఫిర్యాదుతో టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సుమతి చెప్పారు. టీవీ9 బోర్డ్ కు తెలియకుండా కోట్లాది రూపాయలు వ్యక్తిగతంగా వాడుకున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు వెస్ట్ జోన్ డీసీపీ సుమతి. కాసేపటి క్రితమే రవి ప్రకాష్ కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సీతాఫల్ మండిలోని జడ్జి నివాసానికి కాసేపట్లో రవి ప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు తీసుకెళ్లనున్నారు.
�