టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

By Medi Samrat  Published on  11 Oct 2019 10:13 AM GMT
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

నాంపల్లి : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం రోజున కస్టడీ పిటిషన్‌, బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ప్రస్తుతం రవిప్రకాష్‌ చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. రవిప్రకాష్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ బంజరాహిల్స్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 18 కోట్ల రూపాయాలను అక్రమంగా డ్రా చేసినట్లు టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి రవిప్రకాష్‌ను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 14న నాంపల్లి కోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది.

Next Story
Share it