బుల్లితెర బూతు - డబ్బు కోసం ఎంతకైనా తెగించే రకం..!
By సుభాష్
నేటి సమాజంలోని అన్ని రంగాలకు సామాన్యులే ప్రధాన పెట్టుబడి. వారినే టార్గెట్ చేస్తూ వినోదాత్మక షోలూ ప్రసారమవుతుంటాయి. అటువంటి బుల్లితెరపై బూతు ప్రదర్శన విచ్చలవిడిగా చెలరేగుతోందంటూ గత కొన్ని సంవత్సరాలుగా సామాన్యుల నుండి వినవస్తున్న మాట. కొన్ని షోలైతే పోలీసు స్టేషన్ ఫిర్యాదు వరకు వెళ్లిన ఘనతను దక్కించుకున్నాయి. షోలను హిట్ చేసి జీవితాలను బాగుపరుచుకునే క్రమంలో కమెడియన్లు ఉపయోగించిన వల్గర్ కామెడీనే అందుకు దారి తీసింది.
అలా వల్గర్ కామెడీని సామాన్యులపై బలవంతంగా రుద్ది ఓ మెట్టు పైకెక్కిన ఒకరు ఎఫైర్ అంటూ కొత్త ఛాప్టర్ స్టార్ట్ చేశారు. వినోదం ముసుగులో వల్గర్ కామెడీ పంచ్‌లు వేస్తూ, అందుకు తగ్గ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేందుకు షో యాంకర్‌నే జంటగా కుదుర్చుకున్నాడు. అది కాస్తా హిట్ అవడంతో మరో మెట్టుపై కన్నేశాడు. కామెడీ బదులు షో యాంకర్‌తో వల్గర్ డ్యాన్స్ మొదలెట్టేశాడు. దాంతో అప్పటి వరకు సాంప్రదాయబద్దంగా వస్తున్న యాంకరింగ్‌కు చెల్లుచీటి పాడినట్లయింది.
కమెడియన్‌గా బుల్లితెర స్టేజ్‌పై రాణించాలంటే వల్గర్ కామెడీనే కాదు నిత్యం వార్తల్లో నానాల్సి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించాడు. అందుకు పావుగా యాంకర్‌ను వాడుకుని ఫిఫ్టీ ఫిఫ్టీ పాట్నర్ షిప్ మాదిరి యూట్యూబ్ ఛానెల్స్‌ను పంచుకున్నారు. ఏకంగా గాసిప్స్‌కు ఇన్ డైరెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అది కాస్తా పీక్స్‌కు చేరడంతో ఇద్దర్నీ చెరొక సినిమా ఆఫర్ వరించింది. దాంతో మరో మెట్టు ఎక్కకుండానే పైకి చేరినట్లయింది. ఇలా షో పేరుతో వారు నడిపిన ఎఫైర్ చివరకు చూసే జనాలను పిచ్చోళ్లను చేసింది.
ట్రెండ్ మారడాన్ని గ్రహించిన మిగిలిన షో కమెడియన్లు సైతం తమకూ జంటగా ఓ యంకర్‌గా ఉంటే బాగుండునే అనుకునేలా పరిస్థితి మారింది. అనుకున్నదే తడవుగా షో మధ్యలో ఎంట్రీ ఇచ్చి కమెడియన్‌గా స్టార్ రేంజ్‌కి ఎదిగిన ఒకరు ఓన్లీ యాంకరింగే చేసుకుంటూ ఖాళీగా ఉన్న మరొ పొడవాటి యాంకర్‌ను కాళ్లావేళ్లా పడి ఒప్పించాడు. అప్పటికే చిట్టి పొట్టి బట్టలతో ఇంప్రెస్ చేయలేక తెగ ఇబ్బంది పడిపోతున్న ఆ హాట్ యాంకర్‌కు ఖాళీ చెక్కుతో క్యాష్ డ్రా చేసేందుకు వెళ్లే వాడికి రోడ్డుపై డబ్బు మూట దొరికినట్టు ఎదురయ్యాడు. అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొన్ని షోలు చేయగానే ఇలా మునుపటి జంటలాగే వీరికీ సినిమా ఛాన్స్ లు దొరికాయ్.
నేనేమీ తక్కువ తినలేదు అంటూ ఆ రెండు జంటల సంస్కృతిని కొనసాగిస్తూ మరో కమెడియన్ కాదు..కాదు డ్యాన్స్ షో మేల్ యాంకర్ బయటకొచ్చాడు. వచ్చీ రాగానే తనలోని రెండో యాంగిల్‌ని బయటపెట్టి ఏకంగా యాంకర్‌ని కాదు కాదు.. జడ్జీనే లైన్లో పెట్టేశాడు. పాపం ఆ జడ్జీ ఎంత కరువులో ఉందో మరీ. ఏకంగా పూలబొకే తెచ్చేసి మనోడి ముందు మోకరిల్లింది. ప్లానేసిందే మనోడాయే. ముందు కాస్త సిగ్గుపడినట్టు నటించి ప్లాన్ ప్రకారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ జడ్జీ గతంలోనూ.. ఇప్పటికీ హీరోయినే. ఈ జంటలో మాత్రం ఆ మేల్ యాంకర్ కూడా మునుపటి రెండు జంటల మాదిరి సినిమా ఛాన్స్ ఎదురొచ్చి మరీ నిలబడింది. అందులో ఓ సాంగ్ కూడా ట్రెండింగూ.
బుల్లి తెరపై ఇలా ఎఫైర్లు నడిపే క్రమంలో వీళ్లాడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావండోయ్. వారిలో వినపడుతుందా శ్రీనివాస్ అంటూ ఒకరు జడ్జీనే లైన్‌లో పెట్టగా. యూట్యూబ్‌లో వచ్చేలా ఎఫైర్ కొనసాగాలంటూ సాటి యాంకర్‌పై ఒత్తిడి తెచ్చే మిడిల్ స్టార్ కమెడియన్ మరొకరు. ఓన్లీ పంచ్ డైలాగ్‌లకే పరిమితమైతే ఎక్కువ కాలం ఇమడలేమని అందరికంటే ముందే గ్రహించి తేలుకుట్టిన దొంగలా ఆఫ్ ల్యాంగ్వేజ్ యాంకర్‌తో ఎఫైర్ అంటూ పుకార్లు పుట్టించడం మరొక ఎత్తు. ఇలా ఆఖరకు ఎఫైర్ లేనిదే సినీ ఇండస్ట్రీలో రాణించలేమంటూ, ఇసైడర్ ట్రేడింగ్ మాదిరి ఇన్‌సైడర్ పబ్లిసీటీ బాగానే చేశారు. ఇదంతా నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికే అన్న నిజం తెలిసినా వెర్రి పప్పలవుతుంది మాత్రం.