మోదీతో భేటీ అయిన తుల‌సి గ‌బ్బ‌ర్డ్..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2019 6:59 AM GMT
మోదీతో భేటీ అయిన తుల‌సి గ‌బ్బ‌ర్డ్..

తుల‌సి గ‌బ్బ‌ర్డ్.. భార‌త సంత‌తికి చెందిన అమెరిక‌న్ మ‌హిళ. ఆమె నేడు భార‌త ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యింది. 2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తులసి గబ్బర్డ్ పోటిచేసే యోచనలో ఉన్నారు. ఆమె గతంలో నాలుగు సార్లు డెమోక్రటిక్ పార్టీ తరఫున హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్‌కు ఎంపియ్యారు. తులిసి క‌నుక అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో పోటి చేస్తే మొదటిసారిగా అమెరికా ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్న భారతీయ హిందూ మహిళ కానున్నారు.

అయితే.. మొన్న జ‌రిగిన 'హౌడీ మోడీ' కార్య‌క్ర‌మానికి ఆమె హాజ‌రు కాలేక‌పోయింది. సభకు హజరుకాలేకపోతున్నందుకు తుల‌సి మోదీకి క్షమాపణాలు కూడా తెలిపింది. దీంతో పాటు సభకు విచ్చేస్తున్న మోదీకి స్వాగతం పలుకుతూ ఓ వీడీయోను కూడ విడుదల చేసింది. ఈ నేఫ‌థ్యంలో తుల‌సి, మోదీల భేటీ ప్రాథాన్య‌త సంత‌రించుకుంది.

Next Story