తిరుమలలో దుర్గా కిరణ్‌ అనే మరో దళారిని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. టీటీడీ వసతి గుదులను భక్తులకు అధిక మొత్తానికి దళారి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అ ఈ ట్రాప్‌లో ఏడుగురు టీటీడీ ఉద్యోగుల సహకారం కూడా దుర్గా కిరణ్‌కు ఉన్నట్లు సమచారం. ఈ మేరకు వీరంతా కలిసి ఏఇఓ స్థాయి నుంచి అటెండర్‌ స్థాయి వరకు గల అధికారులందరినీ ట్రాప్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా టిటిడి ఉద్యోగులు అంకౌట్లో నగదు జమ చేసినట్లు ..అధికారులు గుర్తించారు. అనంతరం ఏడుగురు టీటీడీ ఉద్యోగులపై అధికారులు కేసు నమోదు చేయాడని రంగం సిద్ధం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.