తిరుమల:  శ్రీవారిని టీటీడీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కంపెనీలో అవినీతి ఉందని ఆరోపణలు చేస్తున్నారని..అంతా దేవుడే చూసుకుంటారని తెలిపారు. తన విన్నపంతోనే సీఎం వైఎస్‌ జగన్ అన్ని విధాలుగా విచారించి ..మరో అవకాశం కల్పించారన్నారు శేఖర్ రెడ్డి. 25 ఏళ్లుగా నిజాయితీగా దేవుడికి సేవ చేసుకుంటున్నానని చెప్పారు. చెన్నైలోని టీ నగర్‌, కన్యాకుమారి ఆలయాల నిర్మాణాల్లో తన వంతు సహాయం చేస్తానన్నారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో గోల్డ్ స్కీం తెచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలో మొదట బంగారం ఇచ్చింది తానేనన్నారు. అలిపిరిలో రూ.15 కోట్లతో 5 ఎకరాల స్థలంలో గో మందిర్‌ తానే స్వయంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.