హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్‌ దాఖలైంది. తక్షణమే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించాలంటూ ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ సురేంద్ర సింగ్‌ ఆదివారం ఈ పిల్‌ దాఖలు చేశారు. అలాగే కార్మికుల సమస్యలపై కమిటీ వేయాలని ఆయన తన పిటిష‌న్ లో కోరారు. ఈ రోజు 4 గంటలకు హైకోర్టు హౌస్ మోషన్ పిటిష‌న్ కు అనుమతి ఇచ్చింది. పిటిష‌న్ పై కుందన్ బాగ్ లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి బంగ్లాలో విచారణ జ‌రుగ‌నుంది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.