సత్తుపల్లి : మరో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నారు. సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నీరజ ఆత్మహత్య చేసుకుంది. సమ్మెపై ప్రభుత్వ వైఖరికి ఆమె చాలా నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె నివాసంలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికే పలువురు ప్రాణాలు తీసుకున్నారు. మరికొంత మంది ఆత్మహత్యాయత్నం చేశారు.

నిజామాబాద్‌–2 ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌ దూదేకుల గఫూర్‌, ముషీరాబాద్‌ డిపోలో డ్రైవర్‌ రమేష్‌(37) గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే నార్కెట్‌పల్లి డిపోకు చెందిన కండక్టర్‌ వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంది. ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజు కూడా కొనసాగుతోంది. ఈ రోజు కూడా ఆర్టీసీ సమ్మెపై హైకోర్ట్‌లో వాదనలు జరగనున్నాయి.

 

 

మరోవైపు.. శనివారం నల్లగొండ జిల్లాకు చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 

 

డ్రైవర్ వెంకటేశ్వర్లు భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.