హైదరాబాద్: ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు..అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తామంటూ నోటీస్ ఇచ్చారు.

విలీన డిమాండే కాకుండా పలు డిమాండ్తను ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచారు.

1.వేతన సవరణ చేపట్టాలి.
2.ప్రతి నెల ఒకటో తేదిన జీతాలు ఇవ్వాలి.
3.సీసీఎస్‌‌, ఏఆర్‌‌బీఎస్‌‌, పీఎఫ్‌‌ బకాయిలు చెల్లించాలి.
4. డైరెక్ట్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ పోస్టులు భర్తీ చేయాలి
5.గ్యారేజీ కార్మికులకు 21 రోజులకే ఇన్సెంటివ్‌‌ క్లాస్‌‌ అమలు చేయాలి
6.మహిళా కండక్టర్లకు అన్ని డిపోల్లో ప్రత్యేక చార్టులు, రెండేళ్ల చైల్డ్ కేర్‌‌ లీవ్‌‌ ఇవ్వాలి.
7. విధి నిర్వహణలో చనిపోతే రూ.30 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలి.
8.అద్దె బస్సులు రద్దు చేసి, కొత్త బస్సులు కొనాలి
9.కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
10.టీఎస్‌‌ ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్‌‌స్పెషాలిటి  హాస్పటల్‌‌గా మార్చాలి.
11.బలవంతంగా టివ్‌‌ విధులకు పంపించొద్దు.
12.పెండింగ్‌‌ ఎన్‌‌క్యాష్‌‌మెంట్‌‌, డీఏ ఎరియర్స్‌‌ రిలీజ్‌‌ చేయాలి.
13.పలు రకాల టాక్స్‌‌లు రద్దు చేయాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.