తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గత వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. సోమవారం నుంచి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజు 79 కేసులు నమోదు కాగా, ఇక మంగళవారం రాత్రి తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 51 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 1326కు చేరుకుంది. ఇక మృతుల సంఖ్య 32కు చేరుకోగా, ఈ రోజు 21 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 822 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే 472 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసులు ఒక్క హైదరాబాద్‌ జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

కాగా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గత 14 రోజులకు పైగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కావడం లేదు. ఒక్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పైగా హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి సంఖ్య భారీగానే ఉంటున్నాయి. పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా జనాలు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సైతం సీజ్ చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *