ఆర్టీసీపై విచారణ వాయిదా.. ఇంకెన్నిసార్లో..!

By అంజి  Published on  25 Nov 2019 7:56 AM GMT
ఆర్టీసీపై విచారణ వాయిదా.. ఇంకెన్నిసార్లో..!

ముఖ్యాంశాలు

  • హైకోర్టులో ఆర్టీసీ జీతభత్యాల పిటిషన్‌పై విచారణ
  • అడ్వొకేట్‌ జనరల్‌ అందుబాటులో లేరు: ఆర్టీసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌
  • ఇప్పటికే ఆలస్యమయిందని పిటిషనర్‌ వాదనలు
  • ఆర్టీసీపై నేడు సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ జీతభత్యాల పిటిషన్‌పై విచారణ జరిగింది. అడ్వొకేట్‌ జనరల్‌ అందుబాటులో లేరని కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్‌ కోర్టును కోరింది. కాగా ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని పిటిషన్‌ వాదించారు. జీతభత్యాలు లేక 30 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. కాగా బుధవారం రోజున పూర్తి వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది.

మరోవైపు 'సేవ్‌ ఆర్టీసీ' పేరుతో కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికుల సమ్మె 52వ రోజుకు చేరుకుంది. డ్యూటీల్లో చేర్చుకోవాలని డిపోల దగ్గర కార్మికుల ఆందోళన చేపట్టారు. డిపోల దగ్గర కార్మికులను అధికారులు విధులకు అనుమతించడం లేదు. సమ్మెను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందు కార్మిక నేతలు ప్రయత్రిస్తున్నారు. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ చెప్పినా.. ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదు. కాగా ఇవాళ సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తుపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5,100 రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. విపక్ష పార్టీల నేతలో ఆర్టీసీ జేఏసీ సమావేశమయ్యింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది.

Next Story