తెలంగాణ కరోనా వైరస్‌ విభృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షా 40,969కి చేరింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,574 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 9 మంది మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 886కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారు 1,07,530 ఉండగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 32,553 ఉంది.

ఇక గడిచిన 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య 2,927 మంది ఉన్నారు. అలాగే హైదరాబాద్‌లో కంటే ఇతర జిల్లాల్లో మండల కేంద్రాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్‌లో 325, రంగారెడ్డి 197, మేడ్చల్‌ మల్కాజిగిరి 185, నల్గొండ 158, కరీంనగర్‌ 144, ఖమ్మం 128, వరంగల్‌ అర్బన్‌ 117, సూర్యాపేట 102 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వందలోపు కేసులు నమోదు అయ్యాయి.

Ts News Corona Cases

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *