క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించ‌డానికి కేంద్రం దేశ వ్యాప లాక్‌డౌన్‌ను విధించ‌డంతో తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్షలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. వాయిదా ప‌డిన ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు తెలంగాణ ఇంట‌ర్ బోర్డు సిద్ద‌మైంది. జూన్ 3న ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ జాగ్ర‌ఫీ, మోడ‌ర‌న్ లాంగ్వేజ్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని తెలిపింది. పాత హాల్‌టికెట్ల నంబర్లతో గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఆ రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి 12 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 23న జ‌ర‌గాల్సిన ఈ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.

ఇటీవ‌లే ఇంట‌ర్ ప‌రీక్షా ప‌త్రాల మూల్యాంక‌నం ప్రారంభ‌మైంది. ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *