వచ్చే ఏడాది రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిదిమంది ఐఎస్ఎస్, ఐపీఎస్ అధికారులు పదవీవిరమణ పొందబోతున్నారు. తేజ్ దీప్ కౌర్, నవీన్ చంద్ లాంటి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారులు, రాజేశ్వర్ తివారీ, బి.పి.ఆచార్య లాంటి సీనియర్ మోస్ట్ ఐ.ఎ.ఎస్ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. సీనియర్ మోస్ట్ అధికారుల రిటైర్మెంట్ తర్వాత రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల సంఖ్య 91కి పడిపోబోతోంది.

తెలంగాణ కేడర్ కి చెందిన తొమ్మిదిమంది అధికారుల రిటైర్మెంట్ షెడ్యూల్ కు తెలంగాణ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.1986 బ్యాచ్ కి చెందిన ప్రభాకర్ అలోక్ (అడిషనర్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ), టి.కృష్ణ ప్రసాద్ (డి.జి రోడ్డు భద్రత) 31 మార్చ్ 2020న పదవీవిరమణ చేయబోతున్నారు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎస్పీఎఫ్) 30 ఏప్రియల్ 2020 పదవీ విరమణ పొందుతారు. 1998 బ్యాచ్ కి చెందిన టి.ఎస్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బి.మల్లారెడ్డి , 2001 బ్యాచ్ అధికారి, ఎస్.ఐ.బి ఐజీ టి.ప్రభాకర్, వరంగర్ పోలీస్ కమిషనర్ వి.రవీందర్ ( 2002 బ్యాచ్ అధికారి), మాదాపూర్ డిసిపి ఎ.వెంకటేశ్వరరావు (2006 ఎస్.పి.ఎస్ ఐ.పి.ఎస్ అధికారి) జూన్ 30వ తేదీ 2020న రిటైర్ కాబోతున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ (1996 బ్యాచ్ అధికారి) 31 అక్టోబర్ 2020న రిటైర్ కాబోతున్నారు. టి.ఎస్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వి.కె.సింగ్ ( 1987 బ్యాచ్ అధికారి) పదవీ బాధ్యతలనుంచి నవంబర్ 30వ తేదీ 2020న విరమణ పొందబోతున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో వందమంది ఐ.పి.ఎస్ అధికారులు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 2020వ సంవత్సరంలో 9మంది మంది ఉన్నత స్థాయి అధికారులు పదవీ బాధ్యతలనుంచి విరమణ పొందడంతో ఈ సంఖ్య 91కి చేరబోతోంది. తెలంగాణ ఐ.ఎ.ఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బి.పి.ఆచార్యతోపాటుగా రాజేశ్వర్ తివారి, ఎమ్. జగదీశ్వర్, ఎ.అశోక్, సి.పార్థసారధి, బినోయ్ కుమార్, అజయ్ మిశ్రా, కె.ధర్మారెడ్డి, హీరాలాల్ సమారియా వచ్చే ఏడాది పదవీ బాధ్యతలనుంచి విరమణ పొందుతున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.