ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
By రాణి
తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19వ తేదీన ఎంసెట్ నోటిషికేషన్ విడుదలవుతుందని విద్యాశాఖాధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 30 వరకూ, రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 6వ తేదీ వరకూ, రూ.1000 లేటు ఫీజుతో ఏప్రిల్ 13వ తేదీ వరకూ ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకూ, రూ.10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27వ తేదీ వరకూ ఎంసెట్ ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకూ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. మే 4,5,7 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, మే 9,11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసెట్ పరీక్షకు అర్హులైన వారు ఈ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.